Le notizie più importanti

చైనా జనాభా పెరుగుదల రేటు ఎన్నడూ లేనంతగా పడిపోయింది… అంటే ఏమిటి దీనర్ధం?

Data:

ఫొటో సోర్స్, Getty Photos

ఫొటో క్యాప్షన్,

జనాభా తగ్గుతుండడంతో ఆందోళనకు గురవుతున్న చైనా

చైనాలో మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, చైనా జనాభా పెరుగుదల రేటు తగ్గుతోంది.

గత 10 సంవత్సరాల్లో సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు .53%గా నమోదైంది.

ఇది, 2000 నుంచి 2010 వరకు నమోదైన .57% కన్నా తగ్గింది.

ప్రస్తుతం చైనాలో 1.41 బిలియన్ల (141 కోట్లు) జనాభా ఉంది.

ఈ పెరుగుదల రేటు ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు.

జనాభా క్షీణతను నివారించేందుకు, ఎక్కువమంది పిల్లల్ని కనేలా దంపతులను ప్రోత్సహించే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చైనాలో ప్రతి పదేళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు విడుదల చేస్తారు. ఈ ఏడాది గణాంకాలు ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని రోజులు ఆలస్యమైంది.

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్,

చైనాలో 2016లో వన్ చైల్డ్ పాలసీని రద్దు చేశారు

2020లో జనాభా లెక్కలను సేకరించారు. సుమారు 70 లక్షలమంది జనగణన అధికారులు ప్రతీ ఇంటికీ వెళ్లి జనాభా లెక్కలు సేకరించారు.

చైనాలో జనాభా లెక్కల సేకరణను అత్యంత సమగ్రంగా నిర్వహిస్తారు. భవిష్యత్తు ప్రణాళికను రచించేందుకు కచ్చితమైన జనాభా లెక్కలు ముఖ్యమని భావిస్తారు.

గత ఏడాది చైనాలో 1.2 కోట్ల శిశువులు జన్మిచారని, 2016లోని నవజాత శిశువుల సంఖ్య(1.8 కోట్లు)తో పోలిస్తే ఈ సంఖ్య బాగా తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ హెడ్ నింగ్ జిజే తెలిపారు.

చైనా సాధించిన సామాజిక, ఆర్థిక అభివృధి ఫలితంగా సంతానోత్పత్తి రేటు తగ్గిందని ఆయన అన్నారు.

ఒక దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే, సంతానోత్పత్తి రేటు సహజంగా తగ్గుతుంది.

అభివృద్ధి కారణంగా అక్షరాస్యత పెరగడం, ఎక్కువమంది కెరీర్ మీద దృష్టి పెట్టడం, ఇతర సామాజిక అంశాల కారణంగా సంతానోత్పత్తి తగ్గుతుంది.

జపాన్, దక్షిణ కొరియాలాంటి దేశాల్లో కూడా ఇటీవల కాలంలో సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో తగ్గుతూ కనిపిస్తోంది.

జనాభా తరుగుదల సమస్యాత్మకం కావడానికి కారణం ఏమిటంటే, జనాభా తగ్గుతున్నకొద్దీ వృద్ధుల సంఖ్య పెరిగి యువత సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది.

ఇది దేశ ఉత్పత్తిని, ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ప్రజారోగ్య, సాంఘిక వ్యవయాలు పెరుగుతాయి.

అయినప్పటికీ, శ్రామిక జనాభా (వర్కింగ్ పాపులేషన్) 88 కోట్లు ఉందని చీఫ్ మెథడాలజిస్ట్ జెంగ్ యూపింగ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Visuals

ఫొటో క్యాప్షన్,

జనాభాలో అధిక శాతం పెద్ద వయస్కులే అంటే రేపు పని చేసే తరం తగ్గిపోయినట్లే

జనాభా తరుగుదలపై చైనా తీసుకుంటున్న చర్యలు

అయితే, చైనా ఇప్పటికే జనాభా తరుగుదలపై చర్యలు తీసుకుంటోంది.

2016లో వివాదాస్పదమైన ‘వన్ చైల్డ్ పాలసీ’ని (ఒక్క బిడ్డనే కానాలి) రద్దు చేసింది. ఎక్కువమంది పిల్లల్ని కనే దిశలో దంపతులను ప్రోత్సహిస్తోంది.

ఈ చర్యల కారణంగా వెనువెంటనే ఫలితాలు కనిపించినా, దీర్ఘకాలంలో జనాభా తరుగుదలను నివారించలేకపోయింది.

ప్రస్తుతం, జనాభా లెక్కలను విడుదల చేయడంతో పాటూ కుటుంబ నియంత్రణ విధానాన్ని చైనా పూర్తిగా రద్దు చేస్తుందని పలువురు భావించారు. అయితే, అలాంటిదేమీ జరగలేదు.

అయితే, ఇవాళ కాకపోయిన త్వరలోనే..2021 లేదా 2022లో కుటుంబ నియంత్రణ విధానాన్ని చైనా ప్రభుత్వం రద్దు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

చైనాలో జనాభా నియంత్రణ కొరకు 1979లో వన్ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టి కట్టుదిట్టంగా అమలు చేశారు.

దీన్ని అతిక్రమించినవారిపై కఠినమైన చర్యలు తీసుకున్నారు. జరిమానాలు విధించడం, ఉద్యోగం నుంచి తొలగించడం, బలవంతపు గర్భస్రావాలు మొదలైన శిక్షలు విధించారు.

గత మూడు నాలుగు దశాబ్దాలుగా చైనాలో జనాభా పెరుగుదల రేఖను వన్ చైల్డ్ పాలసీ నియంత్రించిందనే చెప్పొచ్చు.

కాగా, ప్రస్తుతం చైనాలో జనాభా తరుగుదల ఇతర ప్రపంచ దేశాలపై కూడా ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.

“చైనా ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు చైనాపై ఆధారపడి ఉన్నాయి. చైనాలో జనాభా క్షీణత పరిధి విస్తృతంగా ఉండొచ్చు” అని విస్కాన్సిన్-మేడిసన్ యూనివర్సిటీ సైంటిస్ట్ డాక్టర్ యీ ఫుజియన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

articoli Correlati

Come Creare Unghie Acriliche Perfette a Casa

Le unghie acriliche sono un modo fantastico per avere mani eleganti e curate, anche senza dover andare in...

Dispositivi di pulizia intelligenti: trasformare il modo in cui manteniamo le nostre case in ordine

Nel mondo moderno, la tecnologia ha preso il sopravvento in molti aspetti della nostra vita quotidiana, incluso il...