International
oi-Chandrasekhar Rao
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య క్రమంగా 20 లక్షలకు చేరుకుంటున్నాయి. గంటగంటకూ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రదేశాలు సైతం చేతులు ఎత్తేశాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ స్ట్రెయిన్ మరింత గుబులు పుట్టిస్తోంది.
Coronavirus Upadate : 2nd డెత్ In India, 68-Yr-Old Lady Handed Away In Delhi
ఈ పరిస్థితుల మధ్య భారత్‌లో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 1,972,386 మంది మరణించారు. పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుంటోంది. ఇప్పటిదాకా 92,100,033కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటిదాకా 3,89,621 మంది చనిపోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్ల కోట్లను దాటాయి. ఇప్పటిదాకా 2,33,69,732 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.
బ్రెజిల్‌లో ఇప్పటిదాకా 2,04,726 మంది చనిపోయారు. 81,95,637 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి మెక్సికోలో ఇప్పటిదాకా 1,35,682 మంది మరణించారు. 15,56,028 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. భారత్ తరువాత ఆ స్థాయిలో కరోనా మరణాలు అత్యధికంగా నమోదైన దేశం ఇదే. కరోనా మరణాల రేటు అత్యధికంగా ఉన్న దేశం కూడా ఇదే. అమెరికా, భారత్, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో అత్యథిక కేసులు రష్యాలో నమోదు అయ్యాయి.
భారత్‌లో కొత్తగా 15,968 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 202 మంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 1,04,95,147కు చేరుకున్నాయి. ఇందులో 1,01,29,111 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య లక్షన్నరను దాటింది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,51,529 మంది మృతి చెందారు. 24 గంటల్లో కొత్తగా 17,817 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 2,14,507గా నమోదు అయ్యాయి. ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 331 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 394 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,90,640కి చేరింది. ఇందులో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,84,611 మంది ఉన్నారు. 1,571 మంది మృత్యువాత పడ్డారు. తాజా బులెటిన్ ప్రకారం.. 4,458 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.