Le notizie più importanti

ICC Mens Cricket Environment Cup Super League: Bangladesh Top Points Desk

Data:

దుబాయ్‌: ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌లో బంగ్లాదేశ్‌ అగ్రస్థానానికి చేరుకుంది. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2- తేడాతో కైవసం చేసుకుని పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక 2023 వరల్డ్‌ కప్‌నకు అర్హత సాధించే క్రమంలో ఇప్పటివరకు మొత్తంగా 8 వన్డేలు ఆడిన బంగ్లాదేశ్‌…  ఐదింటిలో గెలుపొంది 50 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. కాగా ఆడిన 9 మ్యాచ్‌లలో నాలుగింటిలో గెలుపొందిన ఇంగ్లండ్‌ 40 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా… రన్‌రేట్‌లో వెనుకబడిన పాకిస్తాన్‌ 40 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉంది. 

ఇక టీమిండియా విషయానికొస్తే… 6 వన్డేల్లో 3 గెలిచి, 3 ఓడి.. 29 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్‌కు తాజాగా సిరీస్‌ సమర్పించుకున్న శ్రీలంక.. ఇప్పటి వరకు ఆడిన ఐదింటిలోనూ ఓడిపోయి, బోణీ కొట్టలేక.. -2 పాయింట్లతో అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. ఇక ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్‌ కప్‌నకు అర్హత సాధిస్తాయి. 

కాగా ఈ మెగా టోర్నీకి భారత్‌ ఆతిథ్యమిస్తున్నందుకుగానూ టీమిండియాకు నేరుగా అర్హత లభిస్తుంది. టీమిండియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్‌ జట్టు కూడా ఈ లీగ్‌లో భాగమై ఉంటుంది. ఇక మంగళవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 103 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.


కర్టెసీ: ఐసీసీ

చదవండి: BAN Vs SL: బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్‌ అలా అయితే ఇంకా సంతోషించేవాడిని!

READ  中國觀察:習近平的「共同富裕」將如何影響世界 - BBC News 中文

articoli Correlati

Come Creare Unghie Acriliche Perfette a Casa

Le unghie acriliche sono un modo fantastico per avere mani eleganti e curate, anche senza dover andare in...

Dispositivi di pulizia intelligenti: trasformare il modo in cui manteniamo le nostre case in ordine

Nel mondo moderno, la tecnologia ha preso il sopravvento in molti aspetti della nostra vita quotidiana, incluso il...